గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా నాయిక. సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి అందాల రాశీ అనే పాటను విడుదల చేశారు. ‘అందాల రాశీ మేకప్ వేసి నాకోసం వచ్చావే.. స్వర్గంలో కేసే నా మీద వేసి భూమ్మీద మూసావే..’ అంటూ సాగుతుందీ పాట. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని రాయగా..సాయిచరణ్ భాస్కరుని, రమ్య బెహరా పాడారు. ఈ పాటకు మంచి స్పందన వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.