వివాదంలో శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా.. థియేటర్ల ముందు మహిళా సంఘాల ధర్నా
శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా నడుస్తున్న మూసాపేట శ్రీ రాములు థియేటర్ దగ్గర ఆందోళన చేశారు మహిళా సంఘ కార్యకర్తలు. సినిమా ప్రదర్శన వెంటనే ఆపేయాలని పోస్టర్లను చించివేసి తగులబెట్టారు.

ఇటీవల సినిమాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలపైనా కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై కూడా ఇప్పటికే పలు కాంట్రవర్సీలు వచ్చాయి. మొన్నటికి మొన్న ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలో భజగోవిందం పాటను అశ్లీల సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్గా వాడుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. తాజాగా యాంకర్ శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా కూడా ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది.
ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసిన ఇ.సత్తిబాబు క్రేజీ అంకుల్స్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లోనటించారు. ముగ్గురు పెళ్లయిన అంకుల్స్.. తమ కాలనీకి వచ్చిన ఒక అమ్మాయికి లైన్ వేసేందుకు ఎలాంటి ప్లాన్లు వేశారు. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా? లేదా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. సమాజంలో దాంపత్య జీవితాన్ని దిగజార్చే విధంగా ఈ సినిమా కథ ఉంది అంటూ వాళ్లు ఫైర్ అయ్యారు. అంతేకాదు ట్రైలర్లో మహిళలను కించపరిచే డైలాగులు కూడా ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయినా కూడా పట్టించుకోకుండా ఆగస్టు 19న సినిమాను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దాంతో మహిళా సంఘాలు రెచ్చిపోయాయి. హైదరాబాద్ మూసాపేట శ్రీ రాములు థియేటర్ దగ్గర ఆందోళన చేశారు మహిళా సంఘ కార్యకర్తలు. సినిమా ప్రదర్శన వెంటనే ఆపేయాలని పోస్టర్లను చించివేసి తగులబెట్టారు. ఇలాంటి సినిమాలు విడుదలైతే సమాజంలోని పెళ్లి అయిన జంటలు తప్పుడు బాట పడతాయని మండిపడ్డారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత శ్రీముఖి నటించిన సినిమాకు ఇలాంటి తిప్పలు రావడంతో తల పట్టుకుంటున్నారు ఆమె అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bullettu Bandi Song|’బుల్లెట్టు బండి’ స్పందనపై వధూవరుల రియాక్షన్..వీడియో
క్రేజీ అప్ డేట్..సత్యదేవ్ భార్యగా నయనతార !
బాలకృష్ణ మూవీ ఆఫర్ కు నో చెప్పిన స్టార్ హీరో..!
రియా చక్రవర్తి భావోద్వేగ సందేశం..నెట్టింట్లో వైరల్
Raja Raja Chora | ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

