Tantra Movie | మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగల్ల. ఇక రెండో సినిమాకే ఏకంగా పవర్ స్టార్ పక్కన వకీల్ సాబ్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. దాంతో ఈ అమ్మడు దశ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సైడ్ క్యారెక్టర్ రోల్స్‌లోనే పర్మినెంట్ అయిపోయింది. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ తను లీడ్ రోల్లో చేస్తున్న మూవీ తంత్ర. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు.
తాజాగా అనన్య బర్త్‌డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూడు డిఫరెంట్ కలర్స్‌లో ఉన్న చేతుల జోడీ అనన్య మోహాన్ని కప్పేస్తున్నట్లు పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అయింది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భరణి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నరేష్ బాపు, రవిచైతన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Team #Tantra wishes the talented actress @AnanyaNagalla a very happy birthday!❤️
Here’s the thrilling First Look💥@srini_gopisetti #NareshBabuP @firstcopymovies @vizagfilmfactor @BeTheWayFilms #SaiRamUday #VijayBhaskarSaddala @maddineni860 @Bharanidp #RRDhruvan @TantraTheMovie pic.twitter.com/xjkf6HlDXA
— BA Raju’s Team (@baraju_SuperHit) August 1, 2023