Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ ప్రస్తుతం శ్రీలంకలో బిజీబిజీగా గడుపుతుంది.అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిలో అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసాయి. ఇక గృహ ప్రవేశం తర్వాత అనసూయ శ్రీలంక టూర్‌కి వెళ్లింది. ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన అనసూయ అక్కడి అందాలని తన ఫాలోవర్స్‌కి కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది. రీసెంట్గా బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడుతూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.
అయితే విహార యాత్రకి వెళ్లిన కూడా అనసూయ వర్కవుట్ మాత్రం ఆపడం లేదు…టూర్ టూరే, వర్క్ అవుట్లు వర్క్ అవుట్లే అన్నట్టు ఉంది ఆవిడ పరిస్థితి. శ్రీలంక వెళ్లిన జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సెల్ఫ్ కేర్ మీద కాన్సెంట్రేట్ చేసినట్టు చెప్పుకొచ్చిన అనసూయ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇక కుటుంబంతో కలిసి షాపింగ్ కూడా చేశారు అనసూయ. భర్త పిల్లలతో కలిసి శ్రీలంకలో కొన్ని వస్తువులు కొన్నారు. ఏది ఏమైన అనసూయ శ్రీలంక టూర్‌ని బిజీ బిజీగా గడిపేస్తుంది. ఆక ఆమె టూర్ ఫొటోలు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్కిస్తున్నాయి.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. పుష్ప చిత్రంతో ఈ అమ్మడి క్రేజ్ పాన్ ఇండియాకి కూడా పాకింది. ప్రస్తుతం అనసూయ జడ్జ్‌గా, నటిగా అదరగొడుతుంది. అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తన నటనకు గాను అనసూయ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది.