Anasuya | నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాలు, షోస్‌తోనే కాకుండా వివాదాలతోను వార్తలలో నిలుస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది. అంతేకాదు, గ్లామర్ పరంగా కూడా అనసూయకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై జరిగే చర్చలు రోజూ ఏదో ఒకదాంట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో అనసూయ చేసిన “రంగమ్మత్త” పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ పాత్ర కోసం తొలుత సీనియర్ నటి రాశికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆమె తిరస్కరించడంతో అనసూయకి ఆ ఛాన్స్ దక్కింది. ఈ పాత్ర ఆమె కెరీర్లో కీలక మలుపుగా మారింది.
అయితే అనసూయపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానళ్లలో విమర్శలు వెల్లువెత్తుంటాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి విమర్శలు ఎక్కువయ్యాయి. దీని గురించి మాట్లాడిన అనేసూయ.. “కొంతమంది మహిళలే నన్ను టార్గెట్ చేస్తున్నారు. వాళ్లతో నాకు ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదు, అయినా నా వ్యక్తిత్వంపై విమర్శలు చేస్తున్నారు” అని తెలిపారు. నేను తల్లి, భార్య, అయినా నా స్టైల్‌కి తగినట్టు బట్టలు ధరిస్తాను. అందం, స్టైల్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ నా వ్యక్తిత్వం లో భాగమే. తల్లిగా ఉండడం అంటే జీవితం లో మిగతావన్నీ వదిలేయాలన్న భావనను నేను ఒప్పుకోను అని ధైర్యంగా స్పందించారు.
నా భర్త, నా పిల్లలు నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. నన్ను ప్రేమిస్తారు, సపోర్ట్ చేస్తారు. వారు ఎప్పుడూ నన్ను జడ్జ్ చేయలేదు. నేను ఎవరికీ నా విధానం మీద బలవంతం చేయను. నా లైఫ్ ఎలా కావాలో అలా బ్రతకడానికే నాకు హక్కు ఉంది. అదే హక్కు మిగిలిన అందరికీ కూడా ఉంది అని అనసూయ స్పష్టం చేశారు. సమాజం నుంచి వచ్చే విమర్శల మధ్య వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కాని అనసూయ మాత్రం అనేక ఛాలెంజెస్ స్వీకరిస్తూ ముందుకు సాగుతుంది.