ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్, మినరల్స్ సమపాళ్లలో అందాలి. వాటితోపాటు ‘ప్రోబయాటిక్స్’ వంటి మంచి బ్యాక్టీరియా కూడా అవసరం. రకరకాల అలర్జీలు, ఆర్థరైటిస్, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీ, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి ఎన్నో సమస్యలను ప్రోబయాటిక్స్ నిరోధిస్తాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి సహజంగానే వచ్చేస్తుంది. కానీ, కొందరికి సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది.
పెరుగు : స్వచ్ఛమైన పాలతో తోడు పెట్టిన పెరుగును ఆహారంలో తీసుకోవాలి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ‘కాలనీ ఫార్మింగ్ యూనిట్స్’ (సీఎఫ్‌యూ) పుష్కలంగా ఉంటాయి.
చద్దన్నం : వండిన అన్నాన్ని రాత్రంతా నీళ్లతో నానబెట్టి, ఉదయాన్నే తింటే మంచి బ్యాక్టీరియా సమపాళ్లలో శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎలాంటి జీర్ణ సమస్యలైనా దూరమవుతాయి.
యాపిల్ సైడర్ డ్రింక్ : సహజంగా పులిసిన అన్‌పాశ్చరైజ్డ్ సైడర్ వెనిగర్వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఒక చిన్న మూతనిండా సైడర్‌ని యాపిల్ జ్యూస్‌లో కలిపి తాగాలి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్కపొడి వేసుకుంటే ఇంకా మంచిది.
చీజ్ : నిల్వ చేసిన చీజ్‌లో ప్రోబయాటిక్స్ పుష్కలం. చీజ్‌ను రోజూ కొద్దికొద్దిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
కెఫిర్ : దీన్ని ప్రోబయాటిక్ రిచ్ డ్రింక్‌గా చెప్పాలి. ధాన్యాలతోనూ కెఫిర్ను తయారు చేయవచ్చు. కొకొనట్ కెఫిర్, రైస్ మిల్క్ కెఫిర్ మొదలైన నాన్ మిల్క్ లిక్విడ్స్‌లో నచ్చిన పండ్లు, కూరగాయల ముక్కలు, దాల్చిన చెక్కపొడి, వెనిలా ఎసెన్స్ కలుపుకొని తాగాలి.