Anasuya | ‘సమాజంలో జరిగే ప్రతిదానికీ సినిమాలే కారణం కాదు’.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు
Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరిగే ప్రతి విషయాన్నీ సినిమాలతో ముడిపెట్టడం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ప్రధానంగా ఒక కల్పిత కథ మాత్రమేనని, సమాజాన్ని మార్చడం లేదా ప్రజలకు విలువలు నేర్పించడం పూర్తిగా సినిమాల బాధ్యత కాదని స్పష్టం చేశారు.
Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరిగే ప్రతి విషయాన్నీ సినిమాలతో ముడిపెట్టడం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ప్రధానంగా ఒక కల్పిత కథ మాత్రమేనని, సమాజాన్ని మార్చడం లేదా ప్రజలకు విలువలు నేర్పించడం పూర్తిగా సినిమాల బాధ్యత కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు. వ్యక్తులుగా మంచి, చెడులను గుర్తించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంటుందని పేర్కొన్న ఆమె, పిల్లలకు విలువలు నేర్పించే బాధ్యత కూడా సినిమాలది కాదని అభిప్రాయపడ్డారు. అయితే కథలు చెప్పే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులు తమ సృజనాత్మక బాధ్యతను పూర్తిగా విస్మరించకూడదని అన్నారు.
సినిమా ఎంతో శక్తివంతమైన మాధ్యమమని, అది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలదని అనసూయ పేర్కొన్నారు. గతంలో హీరో, విలన్ పాత్రల మధ్య స్పష్టమైన తేడా ఉండేదని, ప్రేక్షకులు ఏది అనుసరించాలో, ఏది అనుసరించకూడదో సులభంగా అర్థం చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం కథలు, పాత్రలు మరింత సంక్లిష్టంగా మారడంతో మంచి-చెడు మధ్య ఉన్న గీత కొన్నిసార్లు మసకబారుతోందని అభిప్రాయపడ్డారు. తాను ఇలాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడల్లా సెన్సార్షిప్ లేదా మోరల్ పోలీసింగ్‌కు మద్దతు ఇవ్వడం కాదని అనసూయ స్పష్టం చేశారు. కథలను సృష్టించే ప్రతి ఒక్కరూ వాటి ప్రభావం గురించి అవగాహన కలిగి ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. ఇదే ఆలోచనతో గతంలో ఒక టెలివిజన్ షోను కూడా వదిలేశానని, తన అభిప్రాయాలు ఆ కార్యక్రమం సృజనాత్మకతకు అడ్డుగా మారుతున్నాయని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సృజనాత్మక స్వేచ్ఛ ఎంతో అవసరమని, అయితే ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలనే అవగాహన సమాజంలో పెరగాలని అనసూయ అన్నారు. సినిమాలు సమాజానికి తల్లిదండ్రుల్లా మారాల్సిన అవసరం లేదని, అదే సమయంలో అవి ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోవద్దని పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి చర్యకు సినిమానే కారణమని తాను నమ్మనని చెప్పిన అనసూయ, సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలపై చర్చలు జరగడం, కథనాలను ప్రశ్నించడం, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. అవసరమైనప్పుడు ప్రశ్నించడం సృజనాత్మకతపై దాడి కాదని, అది అవగాహన పెంచే ప్రక్రియ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

