Anasuya| అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, కావల్సినంత టాలెంట్‌తో అనసూయ ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంటుంది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు నటిగా ఓ వెలుగు వెలుగుతుంది. అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టగా, ఇప్పుడు ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తుంటుంది. ఇంక అనసూయకి వివాదాలు కూడా కొత్త కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది.
హీరో విజయ్ దేవరకొండతో వివాదం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం ఇచ్చే ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో తెగ చర్చనీయాంశంగా మారిపోతూ ఉంటుంది. తన మీద నెగటివ్ గా కామెంట్ చేసే వారికి తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది అనసూయ. సోషల్ మీడియా వేదికగా తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు పంచుకోవడం అనసూయ హాబి. తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కవుట్ చేసే వీడియోని షేర్ చేసింది.
తన ఇంటి టెర్రస్ పైనే యోగ, ఇంకా వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి కాక రేపింది అనసూయ. ఇంటి ముందు జిమ్ డ్రెస్ లోనే ముగ్గు వేస్తూ, ఆ తర్వాత డైలీ రోటీన్లో భాగంగా షూటింగ్ కి తయారవుతూ ఆ వీడియోలో కనిపించింది.ఫిజిక్ మెయిన్టైన్ చేసే విషయంలో అనసూయ చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఒక్కోసారి పద్దతిగా చీరకట్టులో కనిపించే అనసూయ ఇంకోసారి మాత్రం చాలా బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చి అందరు షాక్ అయ్యేలా చేస్తుంది.