Anasuya | అనసూయ భరద్వాజ్.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కోసారి ఆసక్తికర కామెంట్స్ కూడా చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మందిలో అనసూయ ఒకరు కాగా, ఈ బ్యూటీ జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేసి కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. నటిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న అనసూయ భరద్వాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.
‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి చిత్రాల్లో నటిగా మెప్పించిన అనసూయ స్పెషల్ సాంగ్స్, ఈవెంట్ పెర్ఫార్మెన్స్ల ద్వారా కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది.. ఇటీవల టీవీ షోలతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ వంటి షోలలో టీమ్ లీడర్‌గా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తనపై వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్‌పై స్పందించింది. ఎవరైనా అభ్యంతరకరంగా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తాను. ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటాను. నేను వాళ్లను ఇక భరించలేను అనుకున్నప్పుడు నా ప్రపంచం నుంచి తొలగించేస్తాను అని చెప్పుకొచ్చింది అనసూయ.
అనసూయ చేసిన ఈ కామెంట్స్‌పై కూడా నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. అనసూయ చాలా మందిని బ్లాక్ చేశాను అని ఉంటే సరిపోయేది కానీ 30 లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడం నమ్మశక్యంగా లేదని అంటున్నారు. రోజుకి పది నుండి వంద మందిని బ్లాక్ చేసిన కూడా మూడు మిలియన్ కాదంటూ సెటైర్స్ వేస్తున్నారు. అనసూయకి ఇన్‌స్టాలో ఉన్న ఫాలోవర్స్ 20 లక్షలు మాత్రమే, మరి ఆమె 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై అనసూయని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి స్పందిస్తూ.. ఇతరులపై కామెంట్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో… ఒక్కసారి ఆమె కోణం నుంచి కూడా ఆలోచించండి. ఆమె నిజంగానే చాలా నెగెటివ్ కామెంట్లను ఎదుర్కొంటోంది. 30 లక్షలు అనేది తుది గణాంకం కాకపోయినా, ఆమె చాలా మందిని బ్లాక్ చేసిందనేది నిజం. ఆమెకు ఆ సంఖ్య గుర్తుండకపోవచ్చు . కనీసం మనం ఒక వ్యక్తిగా గౌరవం చూపిస్తే బాగుంటుంది, ఇలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.