Anasuya Bharadwaj | బుల్లితెర యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ కాంట్రవర్సీలకు దగ్గరగా ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈమె సోషల్ మీడియా మీమర్స్, ట్రోలర్‌పై ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ట్రోలర్, మీమర్స్ ఈరోజు మహిళల దినోత్సవం అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభిస్తారు. అయినా ఈ గౌరవం ఎలాగో 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరేమో ప్రతీసారి కాంట్రవర్సీయేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ చేసిన ఈ ట్వీట్‌పై నెటీజన్స్ విపరీతమైన ట్రోల్స్ వేస్తున్నారు. తెరపై అనుసూయ కనిపించే విధానం, డబుల్ మీనింగ్ పదాలను వాడటం వంటివి గుర్తు చేస్తూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిని గమనించిన అనసూయ గుమ్మడికాయ దోంగలు వచ్చారు చూడండి.. నా ట్వీట్ కింద కామెంట్స్ వేస్తున్నారు అంటూ మరో ట్వీట్‌ను వేసింది. లేటెస్ట్గా అనసూయ ‘పుష్ప’ , ‘ఖిలాడి’ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ఈమె ఆచార్య, పక్కా కమర్షియల్, రంగ మార్తాండా సినిమాలలో నటిస్తుంది.