Anasuya Bharadwaj | అందం, అభినయంతో ఇటు బుల్లితెర, అటు వెండితెరపై రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ.1985 మే 15న సుదర్శనరావు, అనూరాధ దంపతులకు జన్మించిన అనసూయ అనుకోకుండా ఎన్టీఆర్ నాగ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అనసూయను ఎన్‌సిసిలో చేర్పించారు వాళ్ల తల్లిదండ్రులు. ఆ తర్వాత కొన్నాళ్లు ఐడిబిఐ బ్యాంక్‌లో పనిచేసింది. ఆ తర్వాత పిక్స్‌లాయిడ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేసిన అనసూయ ఆ సమయంలో సాక్షి టీవీలో కొత్త న్యూస్ రీడర్స్ కావాలంటూ వచ్చిన ప్రకటన చూసి అప్లై చేసింది.
అందులో సెలక్ట్ అయిన ఆమె న్యూస్ రీడర్‌గాను, యాంకర్‌గాను పని చేసింది. ఆ తర్వాత మా మ్యూజిక్‌లో పని చేసింది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈటీవీలో ప్రారంభించిన కామెడీ షో ‘జబర్దస్త్’కి అనసూయను ప్రజెంటర్‌గా ఎంపిక కావడంతో ఆమె లైప్ టర్న్ అయింది. ఇక రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించి నటిగా మారింది. సినిమాలు, షోస్, సోషల్ మీడియా, ఓపెనింగ్స్ ఇలా రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల కొత్తింట్లోకి అడుగుపెట్టింది. అయితే మే 15న అనసూయ బర్త్ డే కాగా, ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.
హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది. అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి చిందులు వేసింది అనసూయ. బర్త్ డేకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.ఇక అనసూయ మంచి మనస్సుని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. మీరు ఇలాగే సంతోషంగా, సుఖంగా ఉంటూ నలుగురికి మీ వంతు సాయం చేయాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.