Ananya Nagalla | మూవీ ప్రెస్ మీట్లలో తెలుగు ఫిలిం జర్నలిస్టులు అప్పుడప్పుడు ఏం అడుగుతున్నారు అనేది కూడా ఆలోచించకుండా అడిగేస్తుంటారు. ఇప్పటికే పలు మూవీ ప్రెస్ మీట్లలో సురేష్ కొండేటి వింత వింత ప్రశ్నలు అడిగి నటులతో పాటు ప్రేక్షకులకు కోపం తెప్పించాడు. తాజాగా ఒక మహిళ జర్నలిస్ట్ కూడా ఇలానే నోరు జారగా.. ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చింది నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla).
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానునున్నారు. ఈ సందర్భంగా నేడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్లో ఒక మహిళ జర్నలిస్ట్ అనన్యను కాస్టింగ్ కౌచ్‌పై అడుగుతూ.. సినిమా ఛాన్స్ ఇచ్చే ముందు హీరోయిన్స్‌ను కమిట్మెంట్ అడుగుతుంటారు. వేరే రంగాల్లో అలా ఉండదు. కానీ సినిమా రంగంలో ఉంటుంది అని విన్నాను. మీరెప్పుడైనా ఫేస్ చేశారా? అని అడిగింది. దీనికి అనన్య గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
మీరేలా అంత కచ్చితంగా చెబుతున్నారు. మీరు అనుకునేది 100% అబద్ధం. అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ ఇస్తారు అనేది అబద్ధం అని అనన్య చెప్పింది. అయితే ఆ జర్నలిస్ట్ మరో ప్రశ్న అడుగుతూ.. కమిట్మెంట్ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది దీనిపై ఏమంటారు అని అడుగగా.. మీరు ఎక్కడో విన్న మాటలు చెబుతున్నారు. కానీ నేను ఇదే ఫీల్డ్‌లో ఉన్నాను. మీరు అనుకున్నది ఇక్కడ ఏం లేదు అంటూ అనన్య సమాధానమిచ్చింది.
Ananya Nagalla’s Strong Stand Against Casting Couch Allegations #AnanyaNagalla pic.twitter.com/WsXrfi8JEJ
— Telugu Film Producers Council (@tfpcin) October 18, 2024