యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేష్‌కుమార్ సడిగె నిర్మాతలు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని సోమవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్‌డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, వారితోపాటు ఓ పాప ఉన్నారు.
మరో పార్ట్‌లో హీరోని గ్రామస్తులు వెంబడిస్తున్నట్టు కనిపిస్తున్నది. మొత్తంగా కథలోని ఉద్వేగాన్ని పోస్టర్ ఆవిష్కరించిందని చెప్పొచ్చు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: నిసా ఎంటైర్టెన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్.