యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మాతలు. అజయ్ ఇందులో పటేల్‌గా పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఆయన లుక్‌ని పరిచయం చేస్తూ సోమవారం మేకర్స్ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ ఈ లుక్‌లో ప్రమాదకరమైన రెండు కుక్కల్ని చైన్స్‌తో పట్టుకొని, జాలీ దయా లేని కర్కోటకునిగా, రగ్గడ్‌గా కనిపిస్తున్నారు. ఈ నెల 25న ‘పొట్టేల్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు మేకర్స్ తెలిపారు. ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: నిసా ఎంటైర్టెన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్.