ఉత్తరాంధ్ర బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సంప్రదాయ లంగావోణి ధరించి ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది కథానాయిక ఆనంది.
990 దశకంలో ఉత్తరాంధ్ర బుర్ర కథకు గరివిడి లక్ష్మి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఆమె సంగీత వారసత్వానికి నివాళిగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. నరేష్, రాగ్ మయూర్, శరణ్యప్రదీప్, అంకిత్కొయ్య, మీసాల లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌అర్జున్, దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము.