ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. జూలైలో సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనిది.. ఏమిదీ.. ఏమిదీ.. బుజ్జి నెమలి.. పూల కడలి..’ అంటూ సాగే ఈ పాటను సురేశ్ బనిశెట్టి రాయగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు. కేఎస్ హరిశంకర్ ఆలపించారు.
ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూనే, తెలియని భావోద్వేగానికి లోను చేసేలా ఈ పాట సాగింది. నాయకానాయికలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ‘బేబీ’ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అమాయకత్వం, భావోద్వేగం, హృద్యమైన క్షణాలతో సాగే అందమైన ప్రేమకథను అందిస్తున్నామని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్ మహమ్మద్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.