Anand Devarakonda | టాలీవుడ్ యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది బేబి (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో సినిమాలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
90’స్. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్(#90’s – A Middle Class Biopic) అనే వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్ టాలీవుడ్ నటుడు శివాజీ (Shivaji) కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్లో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ అనంతరం దర్శకుడు ఆదిత్య హాసన్ ఎటువంటి కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆనంద్ దేవరకొండతో చేయబోతున్నట్లు సమాచారం. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్, ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.