Anaganaga Oka Raju | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రమోషనల్ వీడియోను పంచుకుంది.