పవన్ మహావీర్, సుహాన, మేఘశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి’ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివాల ప్రభాకర్ దర్శకత్వంలో జీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై జి.శైలజారెడ్డి నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్ క్లాప్‌నివ్వగా, ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విఛాన్ చేశారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివాల ప్రభాకర్.