షూటింగ్‌కు లేటవుతుందనే కారణంతో ముంబైలో ఇటీవల అపరిచితుడి బైక్‌పై ప్రయాణం చేశారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. ఈ ప్రయాణంలో ఆయన హెల్మెట్ పెట్టుకోలేదనే విషయంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ…‘ఆదివారం కాబట్టి రోడ్డుపై రద్దీ ఉండదని ముంబైలోని బల్లార్డ్ వీధిలో మా సినిమా షూటింగ్ ఏర్పాట్లు చేశారు.
అక్కడికి కొద్ది దూరంలోనే మా కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దాంతో లొకేషన్‌కు ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లాను. ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మాత్రమే బైక్‌పై ప్రయాణించా. అది ప్రధాన రహదారి కాదు. నడుస్తూ వెళ్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించా’ అని చెప్పారు. అమితాబ్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తారని ఆయన టీమ్ మెంబర్స్ తెలిపారు.