Amitabh Bachchan: రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమితాబ్ బచ్చన్ ఆస్పత్రికి వెళ్లారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఉదర సంబంధిత చికిత్స కోసం అమితాబ్ ఆస్పత్రిలో చేరినట్లు మంగళవారం మీడియాలో కథనాలు వచ్చాయి.
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండించారు. రోటీన్‌గా జరిగే నెలవారీ చెకప్ కోసం అమితాబ్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది. ఉదర సంబంధిత సమస్యల వల్ల అమితాబ్ మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నట్లు మంగళవారం వార్తలు వ్యాపించాయి. అయితే ఆ వార్తలను అధికార వర్గాలు ఖండించాయి. 83 ఏళ్ల అమితాబ్ రెగ్యులర్‌గా బ్లాగ్‌లో ఎప్పుడూ ఫ్యాన్స్ గురించి అప్డేట్ చేస్తుంటారు. కానీ ఆస్పత్రికి వెళ్లినట్లు వస్తున్న వార్తలపై మాత్రం ఆయన ఇంకా స్పందించలేదు.
ముంబైలోని తన ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. సండే దర్శన్ ఈవెంట్లో భాగంగా ఆయన తన ఇంటి ముందు ఉన్న అభిమానులకు అభివాదం చేస్తారు. కానీ మంగళవారం రాత్రి మీడియాలో కొన్ని కథనాలు వ్యాపించాయి. నానావతి ఆస్పత్రిలో అమితాబ్ చేరినట్లు రిపోర్టులు వెలుబడ్డాయి. మూడు రోజుల పాటు ఆయన ఆ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం బచ్చన్ ఆస్పత్రికి వెళ్లినట్లు ఓ సోర్స్ ద్వారా తెలిసింది. రొటీన్ హెల్త్ చెకప్ కోసం వెళ్లిన అమితాబ్ మళ్లీ ఇంటికి వచ్చేసినట్లు ఒకరు తెలిపారు. అమితాబ్ ప్రతి నెలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లుంటారని చెప్పారు.
రీభూ దాస్‌గుప్తా తీస్తున్న ‘సెక్షన్ 84’ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. ఆ ఫిల్మ్ రిలీజ్‌కు రెఢీగా ఉంది. ఇక ‘కల్కీ 2898 ఏడీ’ సీక్వెల్ కూడా అమితాబ్ నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

