Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ చిత్రం విడుదలై బుధవారానికి 43 ఏండ్లైంది. ఈ సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలను బిగ్‌బీ తాజాగా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ ఎంతో సరదాగా సాగిందంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఫన్నీ సంఘటనని అభిమానులతో పంచుకున్నారు.
‘43 ఏండ్లైంది.. 2+2=5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో..! బెల్ బాటమ్స్ అండ్ ఆల్..!! ఆ రోజుల్లో బెల్ బాటమ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉండేవి. థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు నా ప్యాంట్‌లోకి ఎలుక దూరింది. బెల్ బాటమ్‌కి ధన్యవాదాలు (నవ్వుతున్న ఎమోజీలు)’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.