Amitabh Bachchan బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే విషయం తెలిసిందే. ఆయన తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గత 4 రోజులుగా అమితాబ్ బచ్చన్ ఫేస్ బుక్బు వేదికగా ఎంప్టీ మెసేజెస్ పెడుతున్నారు. అమితాబ్ ఎందుకిలా చేస్తున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు. అమితాబ్ ఇలా చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే అమితాబ్ అలా ఎంప్టీ మెసేజ్ చేయడం వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు. అదేంటంటే.. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆయన ఇలా మెసేజ్‌లు చేస్తున్నారంటూ కొందరు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
పహల్గాంలో ఉగ్ర మూకలు జరిపిన దాడిలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, వారు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. అందుకే బిగ్ బీ ఇలా ఎంప్టీ మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే బిగ్ స్పందించాల్సిందే. ఇక పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన దాడి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయం, ఆటవికం అంటూ మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెట్టారు. పాక్ చేసిన ఈ దుశ్చర్యకి భారత్ తప్పక సరైన సమాధానం ఇస్తుందని అంటున్నారు.
అమితాబ్ బచ్చన్ గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అమితాబ్‌కు అభిమానులు ఉన్నారు. 82 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండటమే కాదు.. సినిమాల్లోనూ నటిస్తూ, మరోవైపు బుల్లితెరపై కూడా పలు షోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెడుతూ.. తెలివిగా కోట్లు సంపాదిస్తున్నారు. ప్రకటనలలో కూడా నటిస్తూ అడపాదడపా సందడి చేస్తూ ఉన్నారు.