Kaalidhar Laapata | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మధుమిత దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూలై 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలపై అభిషేక్ తండ్రి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అమితాబ్ ఎక్స్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పలు పోస్టులు చేశారు. ముఖ్యంగా, ప్రముఖ దర్శకుడు, తన చిరకాల మిత్రుడు అయిన టిన్ను ఆనంద్ పంపిన ప్రశంసా సందేశాన్ని ఆయన పంచుకున్నారు. టిన్ను ఆనంద్ అభిషేక్ నటనను ‘అద్భుతం’ అని కొనియాడారు.
అమితాబ్ తన ట్వీట్లో ఇలా రాశారు: “T 5433 – నా ప్రియమైన స్నేహితుడు, నా దర్శకుడు టిన్ను ఆనంద్ వంటి గొప్ప వ్యక్తి ఇలాంటి సందేశం పంపితే, అది కేవలం మాటల కన్నా ఎక్కువ అర్థాన్నిస్తుంది… నా కృతజ్ఞతలు.” టిన్ను ఆనంద్ పంపిన సందేశంలో, “సర్జీ, అభిషేక్ నంబర్ నా దగ్గర లేదు, దయచేసి నా తరపున అతనికి అభినందనలు తెలపగలరా? అతను కాళీధర్ లాపటాలో అద్భుతంగా ఉన్నాడు. అని ఉంది.
మరో ట్వీట్లో, అభిషేక్ నటనకు వస్తున్న ప్రశంసల పట్ల తన ఆనందాన్ని అమితాబ్ వ్యక్తం చేస్తూ, “అభిషేక్ మరియు ‘కాళీధర్ లాపటా’ సినిమాకు ప్రశంసల పర్వతం కురుస్తున్నందున… నా కుమారుడి కోసం నా గుండె, మనస్సు గర్వంతో నిండిపోయాయి అని పేర్కొన్నారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక కాళిధర్ అనే వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ఆస్తి కోసం తన కుటుంబం తనను వదిలించుకోవాలని అనకుంటుందని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఇంటి నుండి ఎవరికి తెలియకుండా పారిపోతాడు. ఈ క్రమంలో, అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం అవుతుంది. అయితే బల్లు పరిచయం అయ్యాకా అతడి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి. కాళిధర్ ఫ్యామిలీ అతడిని కనిపెడుతుందా.. అనేది కథ.
T 5433 – When someone of the eminence of dear friend and my Director, Tinnu Anand sends this , it says more than just words .. my gratitude 🙏
Sirjee,
As I don’t have Abhisheks number could u pls congratulate him from my side,
He is absolutely brilliant in Kaalidhar Lapata.…— Amitabh Bachchan (@SrBachchan) July 5, 2025