ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’. రమణరెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి రెడ్డి సోమ, మనోహర్ రెడ్డి మంచురి నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో శ్రీవిష్ణు ఆవిష్కరించారు.
హైదరాబాద్ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రమిదని, ఆద్యంతం నవ్విస్తుందని చిత్రబృందం పేర్కొంది. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్వీకే, సంగీతం: స్మరణ్‌సాయి, దర్శకత్వం: రమణారెడ్డి సోమ.