హైదరాబాద్ నేపథ్య కథాంశంతో రూపొందిన యువతరం సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్ ప్రధానపాత్రధారులు. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. స్పిరిట్ మీడియా సంస్ధ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకులు ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘అమీర్ లోగ్’ సహజమైన భావాలను ప్రతిబింబించే సినిమా. చూస్తున్నంతసేపూ హైదరాబాద్ బస్తీల్లోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేం బస్తీల్లో పెరిగాం.
తెలంగాణ యాస, బస్తీ నేపథ్య కథ అవ్వడంతో ఈ పాత్రలు పోషించడం మాకు సులభమైంది. దర్శకుడు రమణ నేచురల్‌గా, సింపుల్‌గా సినిమా తీశారు’ అని చెప్పారు హరి, మనోజ్, శశిధర్. ఇంకా చెబుతూ ‘ఇది బిర్యానీ చుట్టూ తిరిగే కథ. ఫస్టాఫంతా బిర్యానీ స్మెల్ వస్తుంది. సెకండాఫ్ బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. ైక్లెమాక్స్ కడుపు నిండినట్టు ఉంటుంది. తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా, మహిళా పాత్రలే ఈ సినిమాలో కీలకం. అమ్మనాన్నలు, అన్నావదినలు, అక్క, పక్కింటి పాత్రలు.. ఇవన్నీ ఈ కథకు ప్రత్యేక ఆకర్షణలు. సినిమా చూశాక మా అందరికీ విజయంపై నమ్మకం కుదిరింది. స్మరణ్ ఈ సినిమాకిచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్ నెక్ట్స్ లెవల్. హైదరాబాద్ భాషకీ, యాసకి అడ్రెస్‌లా ‘అమీర్‌లోగ్’ ఉంటుంది’ అని తెలిపారు హరి, మనోజ్, శశిధర్.