Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సమంత నటించిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. గతేడాది నవంబర్లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియోసలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్లో ప్రముఖ నటి సమంత, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలోనటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ సీజన్ పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో పెద్ద షాక్ ఇచ్చింది.
గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో సీజన్ 2 ని వద్దనుకుని ప్రైమ్ నిర్ణయం తీసుకున్నట్టుగా ముంబై రిపోర్ట్. తడిసి మోపెడవుతున్న వ్యయంతో పాటు రిటర్న్స్ తక్కువగా ఉండటం వల్ల సీజన్ 2 ఆలోచన చేయకపోవడమే బెటర్ అని వారు అనుకుంటున్నారట. సీజన్ 2 రద్దు చేస్తున్నట్లు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్, ఇటాలియన్ వెర్షన్లను కొనసాగింపులను రద్దు చేశారు. దీనికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ‘సిటడెల్: హనీ – బన్నీ, సిటడెల్: డయానా తదుపరి సీజన్లు నిలిపేసి.. వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నాం.
ఈ సిరీస్ అన్నీ భాషల్లోనూ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇది ఓ ఎమోషనల్ జర్నీ. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.. మరోవైపు, ప్రియాంక నటిస్తోన్న ‘సిటడెల్ పార్ట్ 2’ 2026లో రిలీజ్ కానున్నట్లు తెలిపారు. కాగా సిటాడెల్ కోసం సామ్ చాలా కష్టపడింది. స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చేసింది. దేశ విదేశాలు తిరిగి తెగ ప్రమోషన్లు చేసింది. ఇన్ని చేసినా రిజల్ట్ అంత రాకపోవడంతో నిరాశ చెందింది. ఆమెకు జోడిగా చేసిన హీరో వరుణ్ ధావన్ కు సైతం ఈ రిజల్ట్ రుచించలేదు. దీంతో అందరు కలిసి సీజన్ 2ని రద్దు చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.