ఆదిసాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అమరన్ ఇన్ ది సిటీ’ చాప్టర్-1చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్.బలవీర్ దర్శకుడు. ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వీ.ఆర్ నిర్మిస్తున్నారు. అవికాగోర్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్‌నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. ఆది సాయికుమార్ కొత్త పంథాలో కనిపిస్తారు. థ్రిల్లర్, ఫాంటసీ అంశాల కలబోతగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శాటి ఎం, సంగీతం: కృష్ణచైతన్య, సమర్పణ: జెమినీ.