Amala Paul | ప్రముఖ మలయాళం నటి అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన భర్త జగత్ దేసాయిని డేటింగ్ చేస్తున్న సమయంలో తాను ఒక నటినని అతనికి తెలియదని ఆమె చెప్పారు. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమలా పాల్ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ, “మేము గోవాలో కలిశాం. జగత్ గుజరాతీ అయినప్పటికీ అక్కడే ఉంటున్నాడు. నేను కేవలం కేరళకు చెందిన అమ్మాయినని మాత్రమే అతనికి చెప్పాను. అతను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూడడు. నేను నటినని కూడా అతనికి చెప్పలేదు. కేవలం నా వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే అతనికి చూపించాను” అని అన్నారు. అయితే నేను గర్భవతిగా ఉన్న సమయంలో తానకు నేను హీరోయిన్ అని తెలిసింది. దీంతో నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు, అతను ఒక్కొక్కటిగా నా సినిమాలు చూడటం ప్రారంభించాడు. అతనికి అవార్డుల కార్యక్రమాలు చూడటమంటే చాలా ఇష్టం. నేను అవార్డులు తీసుకోవడం, రెడ్ కార్పెట్‌పై నడవడం, స్టేజ్‌పై మాట్లాడటం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు అంటూ అమలాపాల్ చెప్పుకోచ్చింది. దర్శకుడి విజయ్‌తో విడాకులు తీసుకున్న అనంతరం 2023లో జగత్ దేశాయిని పెళ్లి చేసుకుంది అమలాపాల్. 2024 జూన్‌లో వీరికి కొడుకు పుట్టాడు. సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ఆడుజీవితం, లెవెల్ క్రాస్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంది ఈ భామ.