Allu Sirish | మెగా హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకి బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పాడు. ఇటీవల తన ప్రేయసి నయనికతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. నిశ్చితార్థ ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఈ వేడుక సందర్భంగా ఒకే చోట చేరడంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ముఖ్యంగా శిరీష్ వేసుకున్న స్పెషల్ నెక్చైన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది మీమర్స్ శిరీష్ నెక్చైన్పై సరదాగా ట్రోల్స్ చేయగా, కొందరు ఆయన పెళ్లిలో వడ్డానం కూడా వేసుకుంటారా అంటూ కామెంట్లు చేశారు.
దీనికి స్పందించిన అల్లు శిరీష్ సూపర్‌గా రిప్లై ఇచ్చారు. “హాహాహా… మన తెలుగు మీమర్స్ చాలా ఫన్నీగా ఉంటారు! కానీ వడ్డానం అంటే అది మహిళలు వేసుకునేది మాత్రమే అయితే మన భారతీయ రాజులు, మొఘల్ చక్రవర్తులు చోకర్స్ ధరించేవారు కదా. చోకర్స్ మహిళలకే అన్న భావన పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది. ఇది 2025 , మనం అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి. మన భారతీయ జువెల్రీ స్టైల్‌కి గర్వంగా నిలబడాలి” అని శిరీష్ అన్నారు. అంతేకాదు, ఆయన చరిత్రలోని ఉదాహరణను కూడా ఇచ్చారు “ప్రపంచంలోనే అత్యంత విలువైన జువెల్స్‌లో ఒకటైన ఖిరాజ్-ఇ-ఆలం (టిమూర్ రూబీ) కూడా ఒక చోకర్. 352 క్యారెట్ల ఈ రత్నాన్ని అక్బర్, షాజహాన్, మహారాజా షేర్ సింగ్ ధరించారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని దోచుకుని, క్వీన్ విక్టోరియాకి బహుమతిగా ఇచ్చింది అని వివరించారు.నెక్లెస్‌కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ ఫన్నీ మీమ్ ఫొటో షేర్ చేశారు.
శిరీష్ సమాధానం చూసి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన పాజిటివ్ అటిట్యూడ్, చరిత్రతో ఇచ్చిన వివరణ అందరినీ ఆకట్టుకుంది. కాగా నయనిక.. నితిన్ భార్య శాలినితో పాటు రానా సతీమణి మిహికాకు కూడా మంచి స్నేహితురాలని తెలుస్తోంది. అల్లు శిరీష్– నయనికల వివాహం ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా వచ్చే ఏడాదిలో ఈ శుభకార్యం జరగవచ్చునని తెలుస్తోంది.