Pushpa 2 | ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్‌తోపాటు జాతీయ ఉత్తమనటుడిగా అవతరించాడు అల్లు అర్జున్. దర్శకుడిగా సుకుమార్‌కీ, కథానాయికగా రష్మికకు ఈ సినిమా దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆగస్ట్ 15న ఈ చిత్రానికి సీక్వెల్ అయిన ‘పుష్ప -2 ది రూల్’ విడుదల కానున్న విషయం తెలసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలున్నాయి. సోమవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని ఆదివారం విడుదల చేశారు.
ఈ స్టిల్‌లో ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్న బన్నీని చూడొచ్చు. ఈ ఏడాది అల్లు అర్జున్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాదే ఆయన జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ ఏడాదే ఆయన మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాదే ‘పుష్ప-2’ కూడా రానుంది. ఈ సినిమాతో మరోసారి ఆయన నట విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, దర్శకత్వం సుకుమార్.బి.