Allu Arjun With ARha | చిన్నారి భరతుడితో పుష్ప..ఒకే లొకేషన్ లో అల్లు అర్జున్, అర్హ
ఓ వైపు అల్లు అర్జున్ (Allu Arjun)..మరోవైపు తన కూతురు అర్హ (Allu ARha) ఒకేసారి షూటింగ్ లో పాల్గొంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..? తాజాగా అలాంటి అరుదైన సీన్ ఒకటి జరిగింది.

ఓ వైపు అల్లు అర్జున్ (Allu Arjun)..మరోవైపు తన కూతురు అర్హ (Allu ARha) ఒకేసారి షూటింగ్ లో పాల్గొంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..? ఎన్నో ఏళ్ళ తర్వాత తన కొడుకు నుంచి ఇలాంటి ఫీలింగ్ వస్తుందని ఊహించి ఉంటాడు అల్లు అర్జున్. కానీ ఇఫ్పుడు అర్హతోనే ఈ కోరిక తీరిపోయింది. బాలనటిగా ఈ చిన్నారి శాకుంతలం సినిమాలో నటిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం (Shakuntalam). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది.
ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. చిన్నారి భరతుడి పాత్రలో ఈమె కనిపిస్తుంది. ఈ మధ్యే తన కూతురు నటన చూడటానికి కుటుంబ సమేతంగా శాకుంతలం సెట్‌కు వచ్చి సర్ప్రైజ్ చేసారు అల్లు అర్జున్. తాజాగా మరోసారి అదే జరిగింది. అయితే ఈ సారి సెట్‌కు రావడం కాదు.. అటు అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్..ఇటు అల్లు అర్హ నటిస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్ ఒకే లొకేషన్లో జరుగుతున్నాయి.
ఈ రెండు సినిమాల షూటింగ్ సారథి స్టూడియోస్‌లోనే జరుగుతుండటంతో.. పక్కనే ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్లారు అల్లు అర్జున్. పుష్ప వచ్చి భరతుడిని కలిసారు. తన కూతురు నటిస్తున్న సినిమా.. తన సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుండటంతో ఎగ్జైట్ అయిపోయారు అల్లు అర్జున్. తన జీవితంలో ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు ఐకాన్ స్టార్. కూతురు అర్హను ఇలా సెట్లో కలుసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎత్తుకుని ముద్దాడారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

