Allu arjun Wishes On Onam | టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మలయాళీలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం సందర్భంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో ఒక పోస్టును షేర్ చేస్తూ, “మలయాళీ సోదరులకు నా హృదయపూర్వక ఓనం శుభాకాంక్షలు! ఈ ఓనం మీ జీవితంలో సంపద, శాంతి, శ్రేయస్సు నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ నూతన ఆరంభానికి నాంది పలకాలని ఆశిస్తున్నాను. మీ దత్త పుత్రుడు(Your adopted son) అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. అల్లు అర్జున్ని కేరళలో ముద్దుగా తన అభిమానులు మల్లు అర్జున్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఆయనకు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉంది.
Heartfelt Onam wishes to all Malayalis!
May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽
Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025