అల్లు అర్జున్ ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి మనందరికి తెలిసిందే. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో విలువైన సమయం గడుపుతుంటాడు. రీసెంట్గా తన భార్య స్నేహా రెడ్డి బర్త్ డే కావడంతో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. అక్కడ అందమైన ప్రదేశాలలో విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు.
టూర్‌కి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ వచ్చిన స్నేహా రెడ్డి.. తాజాగా అద్బుతమైన పుట్టిన రోజు ఇష్టమైన వారు పక్కన ఉండగా జరిగిన ఈ బర్త్ డే మరింత స్పెషల్ అయ్యిందని పిల్లలు మరియు బన్నీతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది. స్నేహారెడ్డి తను కేక్ కట్ చేసే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్ కు చిన్న గ్యాప్ ఇచ్చిన బన్నీ అలా భార్య బర్త్ డే వేడుకను నిర్వహించేందుకు వెళ్లాడు. అతి త్వరలో మళ్లీ పుష్ప చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి దసరాకు రెండవ పాట వస్తుందనే టాక్ కూడా వస్తుంది. పుష్ప లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా. ఫాహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు.