Allu Arjun Trivikram New Project | ‘పుష్ప-2’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నాడంటూ అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు బయటకి వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తమిళ నటుడు సముద్రఖని.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్నయ్య(త్రివిక్రమ్) దగ్గరినుంచి నాకు సందేశం వచ్చింది. త్వరలోనే అన్ని వివరాలను చిత్రబృందం వెల్లడిస్తుందంటూ సముద్రఖని వెల్లడించాడు. సోషియో, మైథలాజికల్ జానర్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో శివుడి తనయుడు కార్తికేయుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని సమాచారం. భారతీయ పురాణాలను నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది.