Pushpa 2 The Rule | మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్‌గా ‘పుష్ప 2 ది రూల్’ సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీమియర్స్‌తో పాటు విడుదల రోజుకి సంబంధించి థియేటర్ల్ అన్ని హౌజ్ ఫుల్ బోర్డ్‌లు పెట్టేశాయి. ఈరోజు రాత్రి 9.30 తర్వాత పుష్ప 2 ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. దీంతో ఇప్పటినుంచే అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు మొదలు పెట్టారు. దాదాపు 3 ఏండ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా థియేటర్లో విడుదల కానుడటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇదిలావుంటే నేడు అభిమానులతో కలిసి అల్లు అర్జున్ సినిమా చూడబోతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో ఈరోజు రాత్రి 9.30 గంటల షోకు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వస్తున్నాడు అని తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంధ్య వద్ద పండుగ వాతవరణం నెలకొనగా.. అల్లు అర్జున్ వస్తే.. ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పలేం.