Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య తెగ వార్తలలో నిలుస్తున్నారు. ఏపీ ఎన్నికలలో బన్నీ .. పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయకుండా వైసీపీకి చెందిన వ్యక్తిని సపోర్ట్ చేయడంతో అప్పటి నుండి కాస్త నెగెటివిటీ ఏర్పడింది. ఇక పుష్ప2 సమయంలో థియేటర్లో జరిగిన ప్రమాదం బన్నీకి మరింత నెగెటివిటీని తెచ్చిపెట్టింది. ఆయన ఏకంగా జైలుకి కూడా పోవల్సి వచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుండి తేరుకుంటున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ మూవీపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమా బన్నీ స్థాయిని మరింత పెంచేలా కనిపిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ వైట్ కలర్ టీ షర్ట్ ధరించగా, ఆ టీ షర్ట్ మీద సోషల్ మీడియాలో, సినిమాల్లో బాగా వైరల్ అయిన డైలాగ్స్ రాసి ఉంది. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్ లో రాసి ఉండడంతో పాటు బ్రహ్మనందం ఆ సీన్ లో నవ్వించే హావభావాల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో బన్నీ వేసుకున్న టీ షర్ట్ వైరల్ గా మారింది. మీమ్స్‌ని తన టీ షర్ట్ మీద బన్నీ భలే వేసుకున్నాడుగా అని కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బన్నీ టీ షర్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక బన్నీ నటించిన ‘పుష్ప 2’ హిట్ కావడంతో, దానిని మించేలా సినిమాను తెరకెక్కించడం కోసం దర్శకులు కుస్తీలు పడుతున్నారు. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు. ఈ సినిమా నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. మృణాల్ ఠాకూర్ పేరు ఇంతకు ముందు ప్రముఖంగా వినిపించగా, ఆ తర్వాత ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్, దిశా పటానీల పేర్లు కూడా బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు కూడా ఈ జాబితాలోకి వచ్చింది. మరి అసలు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.