గంగోత్రి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు. ఇప్పుడు ఆయన సినిమాలకు అభిమానులలో భారీ క్రేజ్ ఉంది. అయితే సినిమా గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత 40-60 ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూసి ఉండదు. కోవిడ్ వలన జనాలకు థియేటర్ కి వచ్చి సినిమా చూసే అలవాటు తగ్గింది.
చిన్న సినిమాలకైతే ఆదరణ బాగా తగ్గుతుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ సాధ్యమైనంత వరకు వాటికి సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి మాట్లాడడం లేదంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లడం చేస్తున్నాడు. రీసెంట్గా వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన బన్నీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మూవీ పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అవుతున్నాడు.
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన పుష్పక విమానం చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో అల్లు అర్జున్ విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.