Pushpa 2 The Rule | అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టగా.. తాజాగా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పుష్ప సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యినందుకు అందరికి పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతిని ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. నా పర్సనల్‌గా కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి చెందిన అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ పవన్‌కి థాంక్యూ చెప్పడంతో ఈ గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తుంది.
Kalyan Babai Thank You So Much!!! pic.twitter.com/tWGPhseU02
— Aakashavaani (@TheAakashavaani) December 7, 2024