Allu Arjun | తెలుగు సినిమా ప్రస్తావన వస్తే మొదటగా గుర్తొచ్చేది చిరంజీవి పేరే. ఏళ్లు గడిచిన ఆయన క్రేజ్ ఏ మాత్రం తరగనిది. అప్పట్లో ఆయనకున్నంత అభిమానగళం బహుశా ఇండియాలోనే ఏ స్టార్‌కు లేదేమో. చిరు సినిమా రిలీజవుతుందంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. హిందీ నటుడు బిగ్ బీ సైతం చిరు అభిమానగళాన్ని చూసి షాక్ అయ్యాడంటే మాములు విషయం కాదు. కామన్ ఆడియెన్స్ నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు చిరుకు అభిమానులున్నారు. కాగా తాజాగా అల్లు అర్జున్ తనకు చిరంజీవి అంటే ఎంతిష్టమో ఒక్క మాటలో చెప్పేశాడు.
రీసెంట్గా జరిగిన బేబి అప్రిసియేషన్ మీట్లో అల్లు అర్జున్, నిర్మాత ఎస్కేఎన్ గురించి మాట్లాడుతూ.. ఎస్కేఎన్ చిరంజీవి గారికి వీరాభిమానని, సోషల్ మీడియాలో చిరంజీవిపై ఎవరన్నా కామెంట్ చేస్తే ఘాటుగా సమాధానం ఇచ్చేవాడని చెప్పాడు. ఏలూరులో ఉన్న ఎస్.కె.ఎన్ను అల్లు శిరీష్ తమ దగ్గరకురమ్మని పిలిపించాడని, అలా ఎస్కెఎన్ మా ఫ్యామిలీలో భాగమయ్యాడు బన్నీ తెలిపాడు. అంతేకాకుండా నేను, ఎస్కేఎన్ కట్టే కాలేంత వరకు చిరంజీవి అభిమానులమే. అది ఎప్పటికీ మారదు అంటూ చిరుపై తనకున్న ప్రేమను ఒక్క మాటలో చాటిచెప్పాడు.
గత కొంత కాలంగా బన్నీ ఎలాంటి ఈవెంట్లో పాల్గొన్నా చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం లేదని మెగా అభిమానులు అల్లు అర్జున్‌పై కాస్త గుర్రుగా ఉన్నారు. అల్లు శత జయంతి వేడుకలో ఇద్దరూ కలిసి కనిపించినా వాళ్ళ అనుమానాలు తీరలేదు. కాగా బన్నీ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక బన్నీ బేబి సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేమలో బాధను చెప్పే చిత్రాలు అరుదుగా వస్తుంటాయిని.. అలాంటి సినిమానే బేబి సిని అన్ని చెప్పుకొచ్చాడు. చిత్రబృందాన్ని అభినందించాడు. వారం రోజుల కిందట రిలీజైన బేబికి యూత్ బాగా కనెక్ట్ అయిపోతున్నారు. వీక్ డేస్ కూడా వీకెండ్స్ రేంజ్ లో హాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. రోజు రోజుకు టిక్కెట్లు భారీ సంఖ్యలో తెగుతున్నాయి. కొత్త సినిమాలు సైతం బేబి దెబ్బకి కుదేలవుతున్నాయి. ఇక బ్రో వచ్చే వరకు బేబి హవా కొనసాగడం ఖాయంగా అనిపిస్తుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు.