ఆగస్ట్‌లో విడుదలకావాల్సిన ‘పుష్ప 2’ సినిమాను డిసెంబర్ 6కి వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్సంతా డీలా పడిపోయారు. విడుదల అలస్యం అవుతున్నా.. ఈ సినిమా క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘పుష్ప.. పుష్ప..’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నది. ఈ సందర్భంగా ‘పుష్ప2’ టీమ్ ఆనందం వెలిబుచ్చారు.
కొన్ని రోజుల క్రితం షూటింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి, గడ్డాన్ని కూడా ట్రిమ్ చేసుకొని, తన కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు బన్నీ. ‘పుష్ప2’ కోసం పెంచిన గడ్డాన్ని ట్రీమ్ చేయడంతో అల్లు అర్జున్, సుకుమార్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ స్టోరీలు వెలువడ్డాయి. వాటికి చెక్ పెడుతూ.. మళ్లీ ఫుల్ గడ్డంతో ఆగస్ట్ తొలివారం నుంచి ‘పుష్ప2’ షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు బన్నీ. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో బన్నీ లేని సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ తొలివారం నుంచి బన్నీతో ైక్లెమాక్స్ని చిత్రీకరించనున్నట్టు సమాచారం.