‘పుష్ప 2’తో ఇండియన్ బాక్సాఫీస్ ఉలిక్కిపడే మాస్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. దర్శకుడు అట్లీతో హై స్టాండర్డ్ టెక్నికల్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ వీడియో చూశాక.. ఇది సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో రానున్న సినిమా అని ఇట్టే అర్థమైపోతుంది. మార్వెల్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ తరహా కథతో ఈ సినిమా రాబోతున్నదని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో హీరోగా, విలన్‌గా రెండు పాత్రల్లోనూ అల్లు అర్జునే కనిపిస్తారట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ స్థాయిలో వైరల్ అవుతున్నది. కథ రీత్యా ఇందులో అయిదుగురు కథానాయికలకు ప్లేస్ ఉందట. ఇప్పటికే దీపికా పదుకోన్, మృణాళ్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే ఖరారైనట్టు తెలుస్తున్నది. మిగతా రెండు పాత్రలూ ఎవర్ని వరిస్తాయో చూడాలి. ఇదిలావుంటే ఈ సినిమాకు రెండు టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.
అందులో ఒకటి ‘ఐకాన్’ కాగా, రెండోది ‘సూపర్‌హీరో’. గతంలో బన్నీ కోసమే దర్శకుడు వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ టైటిల్ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే.. అట్లీ సినిమాకు ‘ఐకాన్’ ఖరారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తున్నది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నదని సమాచారం.