Allu Arjun meets Aamir Khan | పుష్ప 2 ది రూల్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ను ముంబైలో ఆయన నివాసంలో కలిశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భేటీకి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. కొందరు వీరిద్దరూ కలిసి ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఉందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది కేవలం సాధారణమైన మర్యాదపూర్వక కలయిక అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ సినిమా విజయం తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఆమిర్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఇద్దరు అగ్ర నటుల కలయిక వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Icon StAAr Allu Arjun meets Amir Khan at his residence 🔥#AlluArjun #AmirKhan pic.twitter.com/09A31uvV37
— Dileep Kumar Jsp (@chirufanikkada1) May 7, 2025