Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. కోలీవుడ్ సంచలన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ యొక్క స్క్రిప్ట్ కూడా పూర్తయింది. అంతేకాకుండా, అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌కు శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. స్టీవెన్స్‌కు టాలీవుడ్లో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. టాలీవుడ్ సర్కిల్లో ఆయన అనుభవజ్ఞులైన ఫిట్నెస్ నిపుణులు. అయితే తాను అల్లు అర్జున్‌తో పని చేయబోతున్నట్లు స్టీవెన్స్ వెల్లడించాడు. ఈ విషయాన్ని స్వయంగా లాయిడ్ స్టీవెన్స్ ఈరోజు X ద్వారా ధృవీకరించారు. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఒక శక్తివంతమైన డాన్ మరియు మాఫియా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లాయిడ్ స్టీవెన్స్ రాకతో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.
Loading … 💪🏽😉 @alluarjun #alluarjunonline #fitat40 #transformation pic.twitter.com/ZBClHJs6Je
— Lloyd Stevens (@lloydstevenspt) May 3, 2025