Allu Arjun | సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఫొటోలు, వీడియోలు చూసి చాలా మంది మోసపోతుంటారు. కొందరు అవి నిజమే అనుకొని తెగ వైరల్ చేస్తుంటారు. కాని అసలు విషయం తెలుసుకున్నాక నోరెళ్లపెడతారు. రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప సాంగ్‌తో బి యునిక్ క్రూ గ్రూప్ అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20 వేదికపై ప్రదర్శన ఇచ్చినట్టు ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.ఆ వీడియోను బన్నీ ఫ్యాన్స్ ఫుల్ గా షేర్ చేసి పుష్ప గాడి రూల్ అంటూ నానా హంగామా చేశారు. అల్లు అర్జున్ కూడా వీడియోను రీట్వీట్ చేసి, వావ్ … మైండ్ బ్లోయింగ్ అని కామెంట్ చేశారు. దాంతో ఆ వీడియో ఇంకా వైరల్ అయింది.
అయితే ఆ వీడియోకి సంబంధించిన అసలు విషయం బయటకు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు ఎడిటెడ్ అని తేలింది. అసలు వీడియోలో ఉంది పుష్ప ట్రాక్ కాదు, ఇమాజిన్ డ్రాగన్స్ బిలీవర్ ట్రాక్. ఆ ట్రాక్‌కి బి యూనిక్ క్రూ గ్రూప్ డ్యాన్స్ వేసింది. కానీ ఎడిటెడ్ వీడియోలో పుష్ప ట్రాక్‌తో ఉండగా , అది నెట్టింట వైరల్ గా మారింది. దీనిని అంతా నిజం అనుకున్నారు. పుష్ప టీమ్ సహా అల్లు అర్జున్ కూడా నమ్మారు. కానీ చివరకు ఎడిట్ చేసిన వీడియోగా తెలిసింది. ఇది ఎడిటెడ్ వీడియోనా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎంత పని చేశార్రా అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ లీడ్ రోల్ లో నటించిన పుష్ప మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. రెండు భాగాల్లో వచ్చిన ఆ మూవీ ప్రతి ఒక్కరిని అలరించింది.. సుకుమార్ దర్శకత్వంతోపాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్.. సినిమాను ఓ రేంజ్ లోకి తీసుకెళ్ళింది. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పుష్ప ఫ్రాంచైజీతో బన్నీ ఇమేజ్ పతాక స్థాయికి చేరుకోగా, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం హలీవుడ్ రేంజ్లో ఉంటుందని అని అనుకుంటున్నారు.
Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD
— Allu Arjun (@alluarjun) August 4, 2025