అల వైకుంఠపురములో చిత్రం తర్వాత అల్లు అర్జున్ నుండి వస్తున్న చిత్రం పుష్ప. డిసెంబర్ 17న ఈ చిత్రం పెద్ద ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం రోజు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. బన్నీ మాట్లాడుతున్న సమయంలో స్టేజ్‌పైకి కూడా వచ్చేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో వారిని అదుపు చేసే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు.
ఇక సోమవారం సాయంత్రం ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం పేరిట బన్నీ తన అభిమానులని కలిసి మాట్లాడేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కి భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ఇక్కడ తోపులాట జరిగిన క్రమంలో పలువురు అభిమానులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన బన్నీ.. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో పలువురి అభిమానులకు గాయాలయ్యాయని తెలిసింది. నా వ్యక్తిగత టీమ్ దానిపై మానిటరింగ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రతి విషయం తర్వాత నాకు చేరవేస్తున్నారు. వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాదని నా వైపునుంచి హామీ ఇస్తున్నా. మీ ప్రేమ, అభిమానాలు నాకు పెద్ద అసెట్. వారి ప్రేమని ఎప్పుడూ లైట్ తీసుకోను` అని తెలిపారు.