హీరో.. విలన్ రెండూ బన్నీనే?
స్టార్ హీరోలు ద్విపాత్రాభినయాలు చేయడం మామూలే. అయితే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర అయితే.. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోలు దక్షిణాదిలో చాలా తక్కువమంది. పాత రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ ఈ తరహా సాహసాలు చేశారు.
స్టార్ హీరోలు ద్విపాత్రాభినయాలు చేయడం మామూలే. అయితే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర అయితే.. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోలు దక్షిణాదిలో చాలా తక్కువమంది. పాత రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణ ఈ తరహా సాహసాలు చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ‘వాలి’ సినిమాలో అజిత్, ‘జై లవకుశ’లో తారక్ ఈ తరహా పాత్రలు చేశారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ సాహసాన్ని అల్లు అర్జున్ కూడా చేయబోతున్నారట. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్త ఇప్పటికే ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. వాటిలో ఓ పాత్ర పూర్తి నెగెటీవ్ షేడ్స్‌తో ఉంటుందట.
కథలో విలన్ కూడా ఆ పాత్రే అని సమాచారం. అంటే హీరో బన్నీనే.. విలనూ బన్నీనే. ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్నాయట. త్వరలోనే బన్నీ ఇండియా తిరిగి వస్తారని తెలుస్తున్నది. ఆయన వచ్చాక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

