Allu Arjun Pushpa Movie | ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటింది. పుష్ప చిత్రంతో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అసలు ఎలాంటి ప్రమోషన్లు చేయకుండానే హిందీలో 100కోట్ల కలెక్షన్లను సాధించి బాలీవుడ్ స్టార్స్‌ను సైతం ఆశ్చర్యంలో ముంచింది. టోటల్‌గా ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి 365కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బ్లాక్‌బస్టర్‌ను సాధించింది. పోటిగా 83, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వంటి సినిమాలున్నా పుష్ప మాత్రం వాటిని అధిగమించి వసూళ్ళ సునామీని సృష్టించింది. తాజాగా పుష్ప చిత్రం మరో ఘనతను సాధించింది.
పుష్ప చిత్రం థియేట్రికల్‌గానే కాదు.. టెలివిజన్‌లోను రికార్డు సృష్టించింది. ఈ చిత్రం మార్చి 20న స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయింది. కాగా ఈ చిత్రం ఫస్ట్ టెలికాస్టింగ్‌కు 22.54 టిఆర్పి రేటింగ్‌ను సాధించింది. మాటీవిలో అత్యధిక టిఆర్పి రేటింగ్ వచ్చిన సినిమాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ఇక జీ తెలుగులో దువ్వాడ జగన్నాధం 21.7 రేటింగ్‌తో , జెమినీ ఛానల్లో అల వైకుంఠపురంలో29.4 టిఆర్పి రేటింగ్‌తో ఆయా ఛానల్స్‌లో అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించిన చిత్రాలుగా రికార్డు సృష్టించాయి. ఇక తెలుగు టెలివిజన్‌లో ప్రముఖమైన మూడు ఛానల్స్‌లో బన్నీ సినిమాలే అత్యధిక టిఆర్పి సాధించడం విశేషం అనే చెప్పాలి.
ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టీ మీడియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ ఈ సారి షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి నార్త్‌లో ప్రమోషన్లు భారీగా చేయాలని ఆలోచనలో ఉన్నాడట.
ఇవి కూడా చదవండి:
R.R.R Business | ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్.. ‘బాహుబలి-2’కంటే 100కోట్లు ఎక్కువే సాధించాలి
Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్‌లో.. దిశా పటాని?
Nithiin | నితిన్ కలెక్టర్‌గా ఫస్ట్ ఛార్జ్ అప్పుడేనట.. వైరల్ అవుతున్న ఆర్డర్ లెటర్