Nithiin | నితిన్ కలెక్టర్‌గా ఫస్ట్ ఛార్జ్ అప్పుడేనట.. వైరల్ అవుతున్న ఆర్డర్ లెటర్
హిట్లతో ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యూత్ స్టార్ నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు.
Macherla Niyojakavargam | హిట్లతో ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యూత్ స్టార్ నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఈ మూడు చిత్రాలలో ‘రంగ్‌దే’ యావరేజ్ హిట్టవగా, ‘చెక్’ ఫ్లాప్‌గా మిగిలింది. ఇక ‘మ్యాస్ట్రో’ నేరుగా డిజిటల్లో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. ప్రస్తుతం ఈయన ‘మాచర్ల నియోజక వర్గం’ అనే పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫస్ట్‌లుక్ (ఫస్ట్ ఛార్జ్)కు సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మార్చి26న ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆబ్స్ట్రాక్ట్ పేరుతో ఓ ఆర్డర్ లెటర్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది. నితిన్ ఈ చిత్రంలో ఎన్.సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. నితిన్‌కు జోడిగా కృతీశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఉత్తర్వులు జారీ📄☑️
taking my FIRST CHARGE on 26th March at 10.08 AM💥💥#MacherlaNiyojakavargam🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic#MacherlaMassLoading 🤙 pic.twitter.com/kqVWHpf3d2
— nithiin (@actor_nithiin) March 24, 2022
ఇవి కూడా చదవండి:
R.R.R Business | ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్.. ‘బాహుబలి-2’కంటే 100కోట్లు ఎక్కువే సాధించాలి
Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్‌లో.. దిశా పటాని?
N.T.R | ఆ పాటంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టమట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

