83వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్
- డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ సమావేశానికి హాజరు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం భేటీ
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 83వ సారి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదివారం నిర్వహించే కీలక సమావేశంలో పాల్గొనడంతోపాటు కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే భేటీకి ఆయన హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సమావేశం నిర్వహిస్తున్నది. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు వంటి అంశాలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన రాజకీయ, పార్టీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశమున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

